‘బ్రో’ సెకండ్ సింగల్ ‘జానవులే’ రిలీజ్ డేట్..


పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలయికలో పి. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బ్రో’. ఈ సినిమా తమిళంలో ఘ‌న విజ‌యం సాధించిన‌ వినోద‌య సితం సినిమాకి రీమేక్‌గా తెర‌కెక్కుతోంది. ఇక జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ఇతర ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవలే ‘మై డియర్ మార్కండేయ’ పాట విడుదలై మెప్పించింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి సెకండ్ సింగల్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్.

‘జానవులే’ అంటూ సాగె రొమాంటిక్ అండ్ లవ్ సాంగ్ ను జూలై 15 న విడుదల చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇకపోతే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఇక ఈసినిమాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.