మాస్ మహారాజా రవితేజ, బ్లాక్ బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని లది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. ఇప్పటికే వీరి కాంబోలో మూడు సినిమాలు ‘డాన్ శ్రీను’, ‘బలుపు’, ‘క్రాక్’ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాల్నిపూర్తి చేశారు. ఇప్పుడీ బ్లాక్ బస్టర్ కాంబో నాలుగోసారి చేతులు కలిపింది. ఈ ప్రాజెక్ట్ ని టాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇక #RT4GM సినిమాను అధికారికంగా అనౌన్స్ చేశారు.
గోపీచంద్ మలినేని గత బ్లాక్బస్టర్ మూవీస్ క్రాక్, వీరసింహా రెడ్డి లానే వాస్తవ సంఘటనల ఆధారంగా యూనిక్ అండ్ పవర్ ఫుల్ కథని రాశారు. అనౌన్స్మెంట్ పోస్టర్ లో భయానక స్థితిలో వున్న ఓ గ్రామం, కాలిపోతున్న ఇల్లు, డేంజర్ బోర్డు కనిపిస్తున్నాయి. టెర్రిఫిక్ గా వున్న ఈ పోస్టర్ క్యూరియాసిటీని పెంచుతోంది.
నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో అత్యున్నత నిర్మాణ విలువలతో నిర్మించనున్నారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. స్టార్ కంపోజర్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఇకపోతే త్వరలోనే మిగిలిన వివరాలను తెలియజేస్తామన్నారు మేకర్స్.