‘బేబీ’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..


ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్యలు కలిసి నటించిన మూవీ ‘బేబీ’. కలర్ ఫోటో లాంటి నేషనల్ అవార్డ్ సినిమాను ప్రొడ్యూస్ చేసిన సాయి రాజేష్ దర్శకత్వంలో ‘బేబీ’ అనే సినిమా రాబోతోంది. ఇక ఇప్పటికే ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇకపోతే జూలై 14న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇదే విషయాన్ని ప్రసాద్ ఐ-మాక్స్ దగ్గర 70 అడుగుల విడుదల తేదీ పోస్టర్ తో ప్రకటించారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ వచ్చింది.

అదేంటంటే ‘బేబీ’ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను రేపు(జూలై 7) సాయంత్రం 5 గంటలకు అమీర్‌పేట్‌ లోని AAA మాల్ లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇకపోతే ఈ రిలీజ్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా వుంది. ఇక ఈ సినిమాకు విజయ్ బుల్గాన్ సంగీతం అందించాడు. ఎస్‌కేఎన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాకి ఎడిటింగ్ విప్లవ్ నైషధం, సినిమాటోగ్రఫీ ఎమ్ఎన్ బాల్ రెడ్డి అందిస్తున్నారు.