‘భోళా శంకర్’ డబ్బింగ్ పూర్తి చేసిన మెగాస్టార్ !


మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో చేస్తున్న మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’ టీజర్‌లో తన వింటేజ్ స్టైలిష్ మాస్ అవతార్‌ లో కనిపించి అందరినీ అలరించారు. ఇటివలే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటివలే విడుదలైన ఈ చిత్రం టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ రాగా.. ఫస్ట్ సింగిల్ చార్ట్‌బస్టర్‌ గా నిలిచింది. ఇక తాజాగా మెగా స్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ డబ్బింగ్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా డబ్బింగ్ స్టూడియో నుంచి ఫోటోలు అభిమానులతో పంచుకున్నారు.

‘సినిమా రూపుదిద్దుకున్న తీరు చాలా ఆనందంగా ఉంది. ఈ ఫైర్ మాస్ ఎంటర్‌టైనర్ ఖచ్చితంగా ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుంది! మీ క్యాలెండర్‌ లను మార్క్ చేసుకోండి! థియేటర్స్ లో కలుద్దాం!..’ అని ట్వీట్ చేశారు మెగాస్టార్. ఈ మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ రామబ్రహ్మం సుంకర అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈచిత్రాన్ని నిర్మిస్తోంది. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన తమన్నా నటిస్తుండగా, ఆయన సోదరి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఇకపోతే ‘భోళా శంకర్’ ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.