చరణ్ సినిమాకు ముహూర్తం ఫిక్సయింది

ramcharanరామ్ చరణ్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు ముహూర్తం ఫిక్సయింది. మిర్చి చిత్రంలో ప్రభాస్ ను అద్భుతంగా ప్రజెంట్ చేసిన కొరటాల శివ….రామ్ చరణ్‌ను గత సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ లుక్, డిఫరెంట్ కథాంశంతో ప్రేక్షకులకు చూపించబోతున్నాడు. నిర్మాత బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. వచ్చే నెల 2వ వారంలో ఈ సినిమా షూటింగు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ స్క్రిప్టును ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాడు.