గ్రూప్‌ 4 పరీక్షలో ‘బలగం’ సినిమాపై ప్రశ్న..


తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 4 పరీక్ష శనివారం భారీ భద్రత నడుమ కట్టుదిట్టంగా నిర్వహించారు. ఇలాంటి కాంపిటేటివ్ పరీక్షల్లో సినిమాలకి సంబంధించిన ప్రశ్నలు కూడా వస్తూ ఉంటాయి. అయితే తాజాగా జరిగిన గ్రూప్ 4 పరీక్షలో తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో వచ్చిన ‘బలగం’ సినిమాపై ఓ ప్రశ్న ఎదురైంది. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే..

బలగం చిత్రానికి సంబంధించి క్రింది జతలలో ఏవి సరిగ్గా జతపరచబడినవి?
A. దర్శకుడు : వేణు యెల్దండి
B. నిర్మాత : దిల్‌ రాజు/హన్షితా రెడ్డి/ హర్షిత్‌ రెడ్డి
C. సంగీత దర్శకుడు : భీమ్స్‌ సిసిరోలియో
D. కొమరయ్య పాత్రను పోషించినారు : అరుసం మధుసుధన్‌..

ఇందులో ఏ, బీ,సీ కరెక్ట్ ఇచ్చి, డీ తప్పు ఇచ్చాడు. ‘బలగం’ సినిమాలో కొమరయ్య పాత్రను పోషించిన నటుడి పేరు కేతిరి సుధాకర్ రెడ్డి. కానీ పైన D ఆప్షన్‌లో ఇచ్చిన అరుసం మధుసుధన్ అనే నటుడు ఈ సినిమాలో కొమరయ్య చిన్న కొడుకుగా నటించాడు. ఇదిలా ఉంటే ఈ ప్రశ్నను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఫీలింగ్స్ చెప్పారు ఈ మూవీ డైరెక్టర్ వేణు యెల్దండి. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. ఇకపోతే గతంలోనూ కానిస్టేబుల్ పరీక్షలో కూడా ‘బలగం’ సినిమా నుంచి ఓ ప్రశ్నను అడిగారు.