సంక్రాంతి రేసులో ‘హనుమాన్’.. కానీ అప్పుడే ?


యువ నటుడు తేజ సజ్జ హీరోగా, అమృత అయ్యర్ హీరోయిన్ గా టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘హను మాన్’. కె నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ టీజర్‌ నెక్స్ట్ లెవెల్ హైప్ క్రియేట్ చేసింది. దీంతో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది చిత్రయూనిట్.

ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 12, 2024 న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన పోస్టర్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అయితే ఇప్పటికే సంక్రాంతి బరిలో మహేష్ బాబు గుంటూరు కారం చిత్రం జనవరి 13న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోగా, ఇక 12న ప్రభాస్ ప్రాజెక్టు కె రిలీజ్ కావలసి ఉంది. కాగా బడా హీరోలతో పోటీకి దిగుతున్న ‘హనుమాన్’ ఏ మేరకు విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి.