నాగ్ బెంగ తీరుతుందా?

nagarjuna-nagachaithanyaనాగార్జున కెరీర్‌ కు ఇప్పుడొచ్చిన ఢోకా ఏమీ లేదు. సినిమా ఎలా ఆడినా.. ఆయ‌న ఇమేజ్ చెక్కు చెద‌ర‌దు. పైగా ఆయ‌న టార్గెట్ సెంచ‌రీ. వంద సినిమాలు చేసే వ‌ర‌కూ ఆయ‌న ఇన్నింగ్స్ కొన‌సాగుతూనే ఉంటుంది. కానీ ఒక‌టే బెంగ‌. త‌న‌యుడు నాగ‌చైత‌న్య కెరియ‌ర్ సరైన దారిలో న‌డ‌వండం లేద‌న్న బాధ ఉంది. చేతిలో అగ్ర నిర్మాణ సంస్థ ఉన్నా… చైతూకి స‌రైన సినిమాలు ప‌డ‌డం లేద‌ని బాగా ఫీల‌వుతున్నారు. ఈ విష‌యాన్ని త‌డాఖా ఆడియో సంద‌ర్భంగా బ‌హిరంగంగానే చెప్పారు. త‌ఢాకాపైన ఆయ‌నకీ కొన్ని న‌మ్మకాలున్నాయి. ఆ సినిమా చైతూకి విజ‌యాల లోటు తీరుస్తుంద‌ని ఆయ‌న ధీమాగా ఉన్నారు. ఈమ‌ధ్యే త‌ఢాకా ర‌షెష్‌ ని నాగ్ చూశారట‌. సినిమాపై ఆయ‌న అన్నివిధాలా సంతృప్తి వ్యక్తం చేశారు. నాగ్ ధీమాకు కార‌ణం అదే! మ‌రోవైపు ఆటోన‌గ‌ర్ సూర్యని గ‌ట్టెక్కించాల‌ని కూడా ప్రయ‌త్నాలు ముమ్మరం చేస్తున్నారు. త్వర‌లోనే ఈ వ్యవ‌హారం ఓ కొలిక్కి వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఒక వేళ‌.. త‌డాఖా సినిమా స‌రైన ప్రతిఫ‌లం ఇవ్వక‌పోతే… వెంట‌నే సొంత బ్యాన‌ర్‌ లో సినిమా తీయ‌డానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈసారి కొత్త ద‌ర్శకుల‌కు కాకుండా.. అనుభ‌వం ఉన్న స్టార్ ద‌ర్శకుడి చేతిలో చైతూని పెట్టాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. ప్రస్తుతానికి చైతూనే నాగ్ బెంగ అలాగే కొన‌సాగుతోంది. త‌డాఖా విడుద‌ల‌య్యాక అది మ‌రింత పెరుగుతుందో, పూర్తిగా మ‌టుమాయం అవుతుందో చూడాలి మరి.