దాస‌రి సినిమా ‘వ‌డ్డీ కాసుల‌వాడు’

dasari-vaddi-kasula-vadduద‌ర్శక‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు మ‌రోసారి మెగాఫోన్ ప‌ట్టనున్నారు. స‌మ‌కాలిన రాజ‌కీయాలు, స‌మ‌స్యల‌పై వ్యంగాత్మక బాణాన్ని వ‌ద‌ల‌బోతున్నారు. ఆయ‌న ద‌ర్శక‌త్వం వ‌హించే 151వ చిత్రానికి స‌ర్వం సిద్దమైంది. మే 4న‌ దాస‌రి జ‌న్మదినం. ఈ సంద‌ర్భంగా కొత్త సినిమాకి క్లాప్ కొట్టబోతున్నారు. ఆ సినిమానే వ‌డ్డీకాసుల‌వాడు! ప‌ర‌మ‌వీర‌చ‌క్ర త‌ర‌వాత దాస‌రి ద‌ర్శక‌త్వం వ‌హించే సినిమా ఇదే! వ‌డ్డీకాసుల‌వాడుగా ఎవరిని చూపించ‌బోతున్నారో? ఈసారి ఆయ‌న టార్గెట్ ఎవ‌రో.. త్వర‌లోనే తేలిపోనుంది. రాజ‌కీయాల ప్రస్తావ‌న ఉన్నా సీరియ‌స్ స‌బ్జెక్ కాద‌ని… వినోదాత్మకంగా తెర‌కెక్కిస్తా అని దాస‌రి చెబుతున్నారు.