100 కోట్ల క్లబ్ లోకి మరో మెగా మూవీ !


మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన సూపర్ హిట్ చిత్రం విరూపాక్ష. డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎటువంటి బజ్ లేకుండా అభిమానుల ముందుకి వచ్చి, బంపర్ హిట్ గా నిలిచింది. డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు గతంలో చేసింది కూడా ఒక సినిమానే .. అది కూడా అంతగా ఆడలేదు.

ఇక సాయిధరమ్ తేజ్ వరుస ఫ్లాపులతో ఉన్నాడు. పెద్ద బ్యానర్, తెలుగు స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన సుకుమార్ స్క్రీన్ ప్లే చేశాడనేది ఈ సినిమాపై కొంతవరకు బజ్ పెరిగేలా చేసింది. దీనితో ఒక మోస్తారు అంచనాలతో థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

ప్రపంచవ్యాప్తంగా విరూపాక్ష తొలి రోజే 12 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. అలాగే , ఈ చిత్రం 4 రోజుల్లో 50 కోట్ల వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. 13 రోజుల్లోనే 82 కోట్ల వరకూ వసూలు చేసిన ఈ సినిమా, ఇప్పుడు 91 కోట్ల గ్రాస్ ను క్రాస్ చేసింది. అతి త్వరలో ఈ చిత్రం 100 కోట్ల మార్క్ ను క్రాస్ చేయబోతుంది. క్షుద్ర శక్తుల కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం సస్పెన్స్ హర్రర్ త్రిల్లర్ గా మంచి ఆదరణ పొందటంతో పాటు ఈ సినిమాకి పోటీగా నిలిచే మరో పెద్ద సినిమా లేకపోవడం కూడా విరూపాక్ష కలెక్షన్స్ పై ప్రభావం చూపించింది. ఏదేమైనా మరో మెగా హీరో .. అతి త్వరలో 100 కోట్ల క్లబ్ లో చేరబోతున్నాడు.