ఎన్టీఆర్ న్యూ లుక్.. అదిరిందిగా


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎన్టీఆర్ 30 లో నటిస్తున్న విషయం తెల్సిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ మధ్యనే షూటింగ్ మొదలుపెట్టిన చిత్ర బృందం .. గ్యాప్ కూడా లేకుండా షూటింగ్ ను పూర్తిచేస్తోంది.ఈ చిత్రంలో ఎన్టీఆర్ అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించనున్నాడు. ఇక పాత్ర కోసం ఎంత కష్టమైన భరించే హీరోల్లో ఎన్టీఆర్ కూడా ఒకడు.

అయితే తాజాగా ఎన్టీఆర్ ఒక ఫ్యాన్ తో దిగిన ఫోటో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఆ ఫొటోలో ఎన్టీఆర్ ఫిజిక్ మాత్రమే కాకుండా గడ్డం కూడా మార్చేశాడు. బ్లాక్ కలర్ షర్ట్ వేసుకొని కూల్ లుక్ లో ఎన్టీఆర్ దర్శనమిచ్చాడు. దీంతో ఒక్కసారిగా ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అదిరిపోయింది ఎన్టీఆర్ అన్నా.. బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.