లార్డ్ హనుమాన్ స్పూర్తితో మహేష్ బాబు పాత్ర.. ఇక రికార్డ్స్ బద్దలే !


దర్శకధీరుడు ss రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ఒక మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుండి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ మూవీ ఎప్పుడెప్పుడు తెరపైకి వస్తుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకి ప్రముఖ రచయిత.. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ ని రెడీ చేస్తున్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్స్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందని ఇప్పటికే వార్తలు వినిపించాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి వర్క్ షాప్ కూడా మొదలైందట. త్వరలోనే మహేష్ కూడా ఈ వర్క్ షాప్ లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కనున్న ఈ మూవీ గురించి ఒక క్రేజి న్యూస్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

అదేంటంటే.. ఈ సినిమాలో రాజమౌళి, లార్డ్ హనుమాన్ స్పూర్తితో మహేష్ బాబు పాత్రను డిజైన్ చేస్తున్నారనే వార్త తెగ వైరల్ అవుతున్నది. ఇక ఇదే కనుక జరిగితే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలవడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. అంతేకాదు ఈ మూవీ మూడు భాగాలుగా రానుందట. ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెట్ కు తగ్గట్టుగా ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. ఇక ఈ సినిమాలో ప్రముఖ హాలీవుడ్ నటులు కూడా నటించనున్నారని టాక్. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఏది నిజమో తెలియాలంటే అధికారక ప్రకటన వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే.