ఉపాసన – చ‌ర‌ణ్ దంప‌తుల బేబి ష‌వ‌ర్ సెల్ర‌బేష‌న్స్‌..


ఉపాస‌న కామినేని కొణిదెల ఈ స‌మాజం బాగుండాలంటూ దాతృత్వం కోసం పిలుపునిచ్చే వ్య‌క్తుల్లో ఎప్పుడూ ముందుటారనే సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఈ వారాంతంలో ఆమె త‌న భ‌ర్త గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి దుబాయ్‌లో బేబీ షవ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్ర‌మంలో వారి ద‌గ్గ‌రి స్నేహితులు, కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే పాల్గొన్నారు.

ఈ వేడుక‌లో చ‌ర‌ణ్‌, ఉపాస‌న జంట చూడ ముచ్చ‌ట‌గా అనిపించారు. ఉపాస‌నకు ఎల‌ప్పుడు మ‌ద్ధ‌తు అందించే ఆమె సోద‌రి అనుష్పాల కామినేని, సింధూరి రెడ్డి ఈ పార్టీని అద్భుతంగా నిర్వ‌హించారు. ఇవి వారికి మ‌రుపురాని క్ష‌ణాలుగా చెప్పవచ్చు. ఉపాస‌న అమ్మ‌మ్మ ఈ వేడుక‌లో హుందాగా క‌నిపించి అంద‌రి హృద‌యాల‌ను దోచుకున్నారు. ఉపాస‌న‌.. రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి జ‌రుపుకున్న ఈ వేడుక‌ల‌కు సంబంధించిన మధుర జ్ఞాపకాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇక రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న కామినేని కొణిదెల జంట‌ చాలా మందికి ఇన్‌స్పిరేష‌న్‌గా నిలుస్తున్నారు. త్వ‌ర‌లోనే త‌ల్లిదండ్రులుగా మారబోతున్న వీరి కొత్త ప్ర‌యాణం చాలా గొప్ప‌గా ఉంటుంద‌నటంలో సందేహం లేదు.