మాస్ హీరోగా ఎదిగిన శ్రీనివాస్ బెల్లంకొండ ‘ఛత్రపతి’తో బాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. ఛత్రపతి తర్వాత అతని తదుపరి చిత్రాన్ని ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా అనౌన్స్ చేశారు. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బ్లాక్ బస్టర్ ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సాగర్ చంద్ర ఇప్పుడు శ్రీనివాస్ బెల్లంకొండ తో మూవీ చేయబోతున్నాడు. ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ఈ సినిమాని నిర్మించబోతోంది.
ఇక తన తొలిచిత్రం ‘అయ్యారే’ తో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు సాగర్ చంద్ర రెండో సినిమా ‘అప్పట్లో ఒకడుండేవాడు’ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక తాజాగా సాగర్ చంద్ర బెల్లంకొండ కోసం విన్నింగ్ స్క్రిప్ట్ రెడీ చేసాడని, ఈ మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ ను భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నామని రామ్ ఆచంట, గోపి ఆచంట తెలిపారు.