తెలుగు మిర్చి రేటింగ్ 3/5
నాని కెరీర్ లో ఏ సినిమాకి రానంత హైప్ దసరాకి వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేశారు. టీజర్ ట్రైలర్ కూడా సినిమా చుదాలనే ఆసక్తిని క్రియేట్ చేశాయి. రామ నవమి కానుకగా మంచి అంచనాలతో థియేటర్ లోకి అడుగుపెట్టిన దసరా.. ప్రేక్షకుడికి ఓ కొత్త సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలిగించింది.
తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల ప్రాంతమైన వీరపల్లి ఊరిలో జరిగిన కథ ఇది. ధరణి (నాని), సూరి (దీక్షిత్ శెట్టి), వెన్నెల (కీర్తి సురేష్) దోస్తులు. సూరి స్నేహం కోసం ప్రేమని కూడా త్యాగం చేస్తాడు ధరణి. అయితే వూర్లో రాజకీయాలు ఈ ముగ్గురి జీవితాలని తలక్రిందులు చేస్తాయి. వీరి జీవితంలోని ప్రేమ, స్నేహం, పగని తెరపై ప్రజంట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది.
దసరా హైలెట్స్ గురించి మాట్లాడితే.. ఇంటర్వెల్ బాంగ్, క్లైమాక్స్ ఫైటు, కీర్తి పాత్రలో ఎమోషన్స్, పాటలు, నేపధ్య సంగీతం.. ఇవన్నీ పక్కగా కుదిరాయి, మాస్ నాని కనిపిస్తాడు. అయితే ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ వరకూ కథనం బాగా సాగదీసిననట్లుగా ఉంటంది. ఈ కథ కూడా ఊహకు అందిపోతుంది.విలన్, హీరోకి మధ్య బలమైన సంఘర్షణ లేకపోవడం కూడా ఒక బలహీనత. యాతే చివర్లో ఓ వచ్చే ఓ భారీ యాక్షన్ సీన్ తో ప్రేక్షకులకు మాస్ ట్రీట్ ఇస్తుంది దసరా.
పాన్ ఇండియా టార్గెట్ గా ఈ సినిమా తీశారు. పాన్ ఇండియాసంగతి ఏమిటో గానీ తెలుగు ప్రేక్షకులకు మరో రంగస్థలం లాంటి సినిమా చూసిన అనుభూతిని అయితే ఇవ్వగలుగుతుంది దసరా.