ప్రాజెక్ట్ చీతాలో భాగంగా నమీబియా నుంచి గతేడాది భారత్కు తీసుకొచ్చిన చీతాల్లో ఒకటి నాలుగు కూనలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ట్విటర్ ద్వారా తెలియజేశారు. ‘‘శుభాకాంక్షలు, వన్యప్రాణుల సంరక్షణలో చారిత్రాత్మకమైన క్షణం. గతేడాది సెప్టెంబరు 17న నమీబియా నుంచి భారత్కు తీసుకొచ్చిన చీతాల్లో ఒకటి నాలుగు కూనలకు జన్మనిచ్చింది’’ అని వీడియో/ఫొటోను మంత్రి ట్విటర్లో షేర్ చేశారు. అంతేకాదు ప్రాజెక్ట్ చీతా బృందాన్ని అభినందిస్తున్నాను అన్నారు. దీంతో దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత భారత్ గడ్డపై చీతాలు జన్మించడం విశేషం.
Congratulations 🇮🇳
A momentous event in our wildlife conservation history during Amrit Kaal!
I am delighted to share that four cubs have been born to one of the cheetahs translocated to India on 17th September 2022, under the visionary leadership of PM Shri @narendramodi ji. pic.twitter.com/a1YXqi7kTt
— Bhupender Yadav (@byadavbjp) March 29, 2023