500 మంది ఫైటర్స్‌తో ‘డెవిల్’ యాక్షన్ ఎపిసోడ్..


నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. ఇక న‌వీన్ మేడారం ద‌ర్శ‌క‌త్వంలో అభిషేక్ నామా ఈ పీరియాడిక్ డ్రామాను నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీ షూటింగ్ ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా క్లైమాక్స్‌ను చిత్రీక‌రిస్తున్నారు. అయితే ఈ క్లైమాక్స్ ఫైట్ ను 500 మందితో తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. అంతేకాదు ఈ ఫైట్ ను వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్ష‌న్ ఎపిసోడ్‌గా చెప్పుకునేలా ఫైట్ మాస్ట‌ర్ వెంక‌ట్ ఆధ్వ‌ర్యంలో డిజైన్ చేశామన్నారు.

ఇకపోతే ‘మా బ్యానర్‌పై ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా డెవిల్ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నాం. కొత్త సినిమాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించాల‌నే త‌ప‌న ఉన్న క‌ళ్యాణ్ రామ్ మ‌రో డిఫ‌రెంట్ అవతార్‌లో ఆక‌ట్టుకోబోతున్నారు. సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూస్తే వావ్ అనేంత గొప్ప‌గా పిక్చ‌రైజేష‌న్ ఉంటుంది. త్వ‌ర‌లోనే మరిన్ని అప్‌డేట్స్‌ను తెలియ‌జేస్తాం’ అన్నారు నిర్మాత అభిషేక్ నామా.