నిజంగానే ‘గేమ్ చేంజ‌ర్‌’


గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజ‌ర్‌’. నిన్న(మార్చి 27) రామ్ చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భ‌గా గేమ్ చేంజ‌ర్ టైటిల్ రివీల్ వీడియో, ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే రాంచరణ్ ఈ పోస్టర్ ను తన సోషల్ మీడియాలో కూడా రిలీజ్ చేసాడు. ఇకపోతే టాలీవుడ్ హీరోస్ లో తమ పోస్టర్స్ ని రిలీజ్ చేసిన తర్వాత 24 గంటలు పూర్తి కాకముందే లక్ష లైక్స్ సాధించిన ఫస్ట్ పోస్టర్ గా అయితే చరణ్ మాసివ్ రికార్డు సొంతం చేసుకున్నాడు. దీంతో టైటిల్ కి తగ్గట్టుగానే నిజమైన ‘గేమ్ ఛేంజర్’ గా నిలిచాడు అని చెప్పాలి.

ఇక శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.