నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు


ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ పాల్పడ్డారన్న కారణంతో నలుగురు ఎమ్మెల్యేలపై అధికార వైసీపీ వేటు వేసింది. ఆనం రామనారాయణ రెడ్డి , మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి , ఉండవల్లి శ్రీదేవి లను సస్పెండ్‌ చేసినట్లు వైసిపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన ఆయన.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.10 నుంచి రూ.15 కోట్లు ఇచ్చి చంద్రబాబు కొనుగోలు చేశారని ఆరోపించారు.

సస్పెన్షన్ పై ఎమ్మెల్యేలు స్పందిస్తూ.. జగన్ వెంట నడిచినందుకు సరైన ఫలితం దక్కిందని, ఘనంగా సత్కరించారని ఎద్దేవా చేశారు. సస్పెండ్‌ చేయడం పార్టీ నిర్ణయని, అయితే ఏకపక్షాన నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. దానికి ఒక పద్ధతి ఉంటుందని, తొలుత షోకాజ్‌ నోటీసులు ఇచ్చి, వివరణ తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కానీ, వైకాపా పెద్దలు ఒంటెద్దుపోకడలతో నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.