భారతీయ సినీ చరిత్రలో గర్వించదగ్గ క్షణమిది.ఇండియన్ సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ‘ఆస్కార్’ అవార్డు ను ‘ఆర్ఆర్ఆర్’ సాకారం చేసింది. ‘నాటు నాటు…’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఉత్తమ పాటగా అవార్డును సొంతం చేసుకుంది. లాస్ ఏంజిల్స్ వేదికగా 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో పోటీ పడిన ‘ పాటలను వెనక్కి నెట్టి ‘నాటు నాటుఆస్కార్ దక్కించుకుంది.
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ , రామ్చరణ్ కథానాయకులుగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. గతేడాది విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, రూ.1000కోట్లకు పైగా వసూళ్లను రాబ్టటింది. భాషతో సంబంధం లేకుండా ‘నాటు నాటు…’ పాట ప్రపంచ సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఆ ఉత్సాహంతోనే ‘ఆర్ఆర్ఆర్’ మూవీ వివిధ కేటగిరిల్లో ఆస్కార్ అవార్డులకు పోటీ పడగా, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు…’కు ఆస్కార్ నామినేషన్స్ తుది జాబితాలో చోటు దక్కించుకుంది. ఇప్పుడు ఆస్కార్ అందుకున్న తొలి భారతీయ చిత్రంగానూ ‘ఆర్ఆర్ఆర్’ చరిత్ర సృష్టించింది.