క్యాస్టింగ్ కౌచ్.. ఇప్పటికే దీనిపై పలువురు నటీమణులు నోరువిప్పారు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తమకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మ విద్యాబాలన్, తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఓ డైరెక్టర్ రూమ్‌కు రమ్మన్నాడు అంటూ సంచలన కామెంట్లు చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘‘నేను ఇండస్ట్రీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఓ యాడ్ షూట్ కోసం డైరెక్టర్‌ను కలిసేందుకు చెన్నై వెళ్లాను. కాఫీ షాపులో కలుద్దామని చెప్పాను. కానీ ఆ డైరెక్టర్ ఆయన రూమ్‌కు రమ్మన్నాడు. అప్పుడు అతని ఆలోచన అర్థమైంది. రూమ్‌లోకి వెళ్లగానే లాక్ చేయకుండా.. కొంచెం తెరిచి ఉంచాను. ఆయన ఐదు నిమిషాల పాటు ఏమీ మాట్లాడకుండా ఉండి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ సంఘటనను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను’’ అని చెప్పుకొచ్చింది.
అయితే ఈ ఒక్క సంఘటనే కాదని.. ఆ తర్వాత ఇటువంటవి ఎన్నో సంఘటనలు ఎదుర్కొన్నానని వెల్లడించింది. ఇక 2005లో ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన ఈ అమ్మడు డర్టీ పిక్చర్, షేర్ని, కహాని వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.