నరేష్, పవిత్రల పెళ్లి నిజమేనా ?


టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు నరేష్‌,పవిత్ర లోకేష్ రిలేషన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత కొద్ది నెలలుగా వీరిద్దరి ప్రేమ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇక ఈ ఏడాది కొత్త సంవత్సరం ప్రారంభం సందర్భంగా నరేష్‌-పవిత్రలు తమ బంధం గురించి అధికారిక ప్రకటన చేశారు. లిప్‌లాక్‌తో ప్రపంచాన్ని షేక్‌ చేశారు. తాజాగా నరేష్‌, పవిత్ర వివాహం బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ‘‘ఒక పవిత్ర బంధం.. రెండు మనసులు.. మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. కొత్త ప్రయాణం ప్రారంభించాం మీ ఆశీస్సులు కోరుకుంటున్నాం’’ అంటూ ట్విట్టర్‌ వేదికగా నరేష్‌ పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం వీరి పెళ్లి వీడియో వైరల్‌గా మారింది. కాగా నరేష్ పవిత్ర నిజంగా పెళ్లి చేసుకోలేదని మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పెళ్లి చేసుకున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఇక నరేష్‌ గతంలో మూడు వివాహాలు చేసుకున్నాడు. ప్రస్తుతం మూడో భార్య రమ్య రఘుపతితో కూడా విడిపోయాడు. వీరిద్దరికి ఇంకా లీగల్‌గా విడాకులు రాలేదు. ఈ వ్యవహారం కోర్టులో ఉంది. అంతేకాదు రమ్య తనను 10 కోట్ల రూపాయలు డిమాండ్‌ చేస్తోందని.. ఆమొత్తం ఇస్తేనే విడాకులు ఇవ్వడానికి అంగీకరిస్తానని తనను బెదిరించిందని నరేష్‌ తెలిపాడు.ఇదిలావుంటే నరేష్‌ తనను మోసం చేశాడని.. అతడికి విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదని రమ్య రఘుపతి స్పష్టం చేసారు.