తెలంగాణలో ఒంటిపూట బడులు షెడ్యూల్‌ రిలీజ్‌


తెలంగాణలోని విద్యాశాఖ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. మార్చి 15వ తేదీ నుండి ఒంటి పూట బడులు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది విద్యాశాఖ. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణాలోని విద్యాసంస్థలు ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశించింది. అయితే. ఏప్రిల్ 25నుండి పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసులు నిర్వహించనున్నారు. ఒంటిపూట బడి సమయాల్లో అన్ని పాఠశాలల్లో స్వచ్ఛమైన తాగునీరు అందేలా చూడాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించారు.

ఇక తెలంగాణలో ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13 వరకు జరుగుతాయి. మిగిలిన తరగతులకు ఏప్రిల్ 12వ తేదీ నుంచి ప్రారంభించాలని తాజాగా విద్యాశాఖ నిర్ణయించింది. ఇకపోతే ఈ ఏడాది వేసవి సెలవులు ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వ తేదీ వరకు ఉంటాయని విద్యాశాఖ ఇటీవలే వెల్లడించింది. తిరిగి పాఠశాలలు జూన్ 12న పాఠశాలలు పున: ప్రారంభం అవ్వనున్నాయి.