ఆస్ట్రేలియా సిడ్నీకి చెందిన ఓ ఫిట్నెస్ ఔత్సాహికుడు పుల్ అప్స్లో గిన్నిస్ రికార్డును బద్దలుకొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. 24 గంటల్లో 8,008 పుల్ అప్స్ చేసి కొత్త రికార్డు నెలకొల్పాడు. గత రికార్డు 7,715 పుల్ అప్స్ను చెరిపేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను జాక్సన్ ఇటాలియోనో తన ఇన్స్టాగ్రాంలో షేర్ చేశాడు. ఈ రికార్డు కోసం తాను 8 నెలలపాటు శిక్షణ తీసుకున్నట్లు వివరించాడు. ఎట్టకేలకు తన శ్రమకు ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేశాడు. గిన్నిస్ రికార్డు నెలకొల్పడం సంతోషంగా ఉందన్నాడు.