టాలీవుడ్ దర్శకుడు వెంకటేశ్ మహా ‘కేజీయఫ్’ చిత్రాన్ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారాయి. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ యూట్యూబ్ ఛానల్ చర్చా వేదికలో దర్శకులు శివా నిర్వాణ, వివేక్ ఆత్రేయ, నందినిరెడ్డి, మోహన్ కృష్ణ ఇంద్రగంటి, వెంకటేశ్ మహా పాల్గొన్నారు. ఇందులో భాగంగా వెంకటేశ్ మహా ‘కేజీయఫ్’పై కామెంట్స్ చేశారు.
‘తల్లి కలను నెరవేర్చడం కోసం బంగారాన్ని సంపాదించి.. చివరికి ఆ మొత్తాన్ని సముద్రంలో పడేశాడు. అలాంటి వ్యక్తి గురించి సినిమాలు చేస్తే మనం చప్పట్లు కొడుతున్నాం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంకటేశ్ మహా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.