సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ తన తండ్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్న తనంలో నాన్న తనని లైంగికంగా వేధించాడంటూ ఆవేదనని వెళ్లగక్కారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో ఖుష్బూ మనసు విప్పారు. . తనకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు తండ్రి తనని లైంగికంగా వేధింపులకు గురి చేశాడని ఆరోపించారు. తనను గాయపరిచి, చిత్రహింసలకు గురిచేసేవాడని చెప్పారు.
‘‘ ఎనిమిదేళ్ల వయసులోనే నేను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను. ఈ విషయాన్ని చెబితే మా అమ్మ నమ్ముతుందో లేదోనని ఎంతో భయపడ్డాను. ఎందుకంటే.. ఏం జరిగినా తన భర్త దేవుడని నమ్మే మనస్తత్వం ఆమెది. 15 ఏళ్ల వయసులో ఆయనకు ఎదురుతిరగడం మొదలుపెట్టాను. నాకు 16 ఏళ్లు రాకముందే ఆయన మమ్మల్ని వదిలివెళ్లిపోయాడు. ఆ సమయంలో మేము ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం’’ అని గతాన్ని గుర్తు చేసుకున్నారు.