తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల


తెలంగాణ ఎంసెట్ 2023 నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ ఎంసెట్ -2023)ను ఉన్నత విద్యామండలి నిర్వహిస్తుంది. టీఎస్ ఎంసెట్ కోసం కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

దరఖాస్తులను మార్చి 3 నుంచి ఏప్రిల్ 10 వరకు ఆలస్య రుసుం లేకుండా స్వీకరిస్తారు. ఇంజనీరింగ్ పరీక్ష మే 7, 8, 9 తేదీల్లో, అగ్రికల్చర్-మెడికల్ పరీక్ష మే 10, 11 తేదీల్లో జరగనున్నాయి. ఏదైనా ఒక పరీక్షకు అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైన అభ్యర్థులు రూ.500, మిగతావారు రూ.900 చెల్లించాలి. రెండు పరీక్షలకు అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైన అభ్యర్థులు రూ.1000, మిగతావారు రూ.1800 చెల్లించాల్సి ఉంటుంది.

టీఎస్ ఎంసెట్ సమగ్ర నోటిఫికేషన్, ఆన్‌లైన్ అప్లికేషన్, ఇన్‌స్ట్రక్షన్ బుక్‌లెట్ తదితర వివరాల కోసం ఎంసెట్ అధికారిక వెబ్‌సైట్‌ https://eamcet.tsche.ac.in సందర్శించవచ్చు.