”నేను స్టూడెంట్ సర్!” రిలీజ్ వాయిదా..


తొలి చిత్రం ‘స్వాతిముత్యం’ తో ఆకట్టుకున్న యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ తన రెండో సినిమా ‘నేను స్టూడెంట్ సార్!’ తో ప్రేక్షకులముందుకు రాబోతున్నారు. ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నంబర్ 2 గా వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ని ‘నాంది’ సతీష్ వర్మ నిర్మిస్తుండగా నూతన దర్శకుడు రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా టీజర్ అంచనాలను పెంచగా, ఫస్ట్ సింగిల్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనితో మేకర్స్ రీసెంట్ గానే మార్చ్ 10 రిలీజ్ అవుతుందని చెప్పిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు మేకర్స్ అనూహ్యంగా సినిమా రిలీజ్ ని వాయిదా వేసినట్టుగా కన్ఫర్మ్ చేశారు. కొత్త డేట్ ని అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ సినిమాని అయితే వేసవి సెలవులు కానుకగా రిలీజ్ కి సిద్ధం చేస్తున్నట్టుగా తెలిపారు. ఇక ఈ సినిమాలో అవంతిక హీరోయిన్ గా నటిస్తుండగా మహతి సాగర్ సంగీతం అందిస్తున్నాడు.