కన్ ఫ్యూజన్ లో కలెక్షన్ కింగ్

mohanbabuనటుడు మోహన్ బాబు కాస్త భోళా మనిషి. ఉన్నది ఉన్నట్టు కక్కేయటమే గానీపర్యవసానాలు ఆలోచించరు.ఎప్పుడు ఏది తోస్తే అది మాట్లాడేయటమే.ఇది అన్నిచోట్లా పనికిరాదన్నవిషయాన్ని ఆయన ఎప్పటికి గ్రహిస్తారో గానీఈ లోగా జరగాల్సిన డ్యామేజి జరిగిపోతుంది. రాజకీయ పార్టీపెట్టి సొమ్ముచేసుకునే దమ్ముతనకు లేదంటూ ఆయన మొన్నటికి మొన్న మీడియాముందు వాపోయారు. అదిగో అది చిరంజీవి నిఉద్దేశించే అన్నారంటూ మీడియా ఒక్కసారిగా ఘోల్లుమంది. దాంతో ఆయననాలిక్కరుచుకుని ” అబ్బే…నేను అన్నది చిరంజీవిని ఉద్దేశించి కాదు… మేవిద్దరం మంచి స్నేహితులం.అసలు అన్ని రాజకీయపార్టీలు అలాగే వున్నాయి. ” అంటూ మరో వివాదాస్పద స్టేటు మెంటు పారేశారు.అది చాలదన్నట్టు” త్వరలో రాజకీయాల్లోకి వస్తా. ఏ పార్టీ లో చేరేది ఇప్పుడే చెప్పను. “అంటూ మీడియా ద్వారాప్రజలకు ఓ పజిల్ పడేశారు. కామెడి కాకపోతే అసలు ఆయన చేరడానికిరాష్ట్రంలోఎన్ని పార్టీలువున్నాయని ? ఆయన కాంగ్రెస్ లోకి ఎటూ వెళ్లరు అన్నది అందరికీ తెలుసు .జగన్ తో మోహన్ బాబు అబ్బాయికి బంధుత్వం వుందనికూడా అందరికీ తెలుసు. ఆ మధ్యన ఒకసారి చంచల్గూడా జైలుకు వెళ్లి జగన్ ను కలిసి బైటికొచ్చి జగన్ మంచివాడు అంటూ సర్టిఫికేట్ ప్రదానంచేశారు. ఎటొచ్చీకన్ ఫ్యూజన్ఏవిటంటే ఇటీవలే చంద్రబాబునాయుడు ను తిరుపతి లోని తన కాలేజికి అతిధి గా పిలిచి భారీ సన్మానం చేసి ఇలాంటి నేత రాష్ట్రానికి కావాలి అంటూ తెగ పొగిడేశాడు. అంటే ఇప్పుడు చంద్రబాబునాయుడో ,జగన్ మోహన్ రెడ్డో ఈయనను తమ పార్టీలోకి స్వాగతించాల్సి వుంది. అందుకు ఆ రెండు పార్టీల నాయకులుఎంతవరకు సిద్ధంగా వున్నారనేది వాళ్ళకే తెలియాలి.అలా స్వాగతిస్తే వెళ్లేందుకు ఈయన ఎంతవరకుసిద్ధంగా వున్నారో మరి. ఏది ఏమయినాతనకంటూ ఒక క్లారిటీ వచ్చేవరకు ఇలాంటి అయోమయపుప్రకటనలుఇవ్వకుండా తాను నియంత్రించుకుంటే మంచిది అన్నది ఒక సర్కిల్నుంచివినిపిస్తున్నసలహా.