ప్రభుత్వ విధులు నిర్వహించే ఏ ఉద్యోగి కూడా యూట్యూబ్ ఛానల్‌ను నడపరాదంటూ కేరళ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. స్టార్‌డమ్‌తో సంబంధం లేకుండా ప్రస్తుతం అతి సామాన్యులు సైతం వారి ప్రతిభకు అనుగుణంగా యూట్యూబ్ ఛానల్స్ విజయవంతంగా నడుపుతున్న విషయం తెలిసిందే. అయితే దీంతో కొందరు ఉద్యోగులు అదే పనిగా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకొంటున్నారు. వంటలు, కామెడీ కార్యక్రమాల వీడియోలు అప్‌లోడ్ చేసి రూ.లక్షల్లో సంపాదిస్తున్నవారూ ఉన్నారు. ఈ తరుణంలో ఈ అదనపు ఆదాయ మార్గంపై వేటు వేస్తూ ప్రభుత్వ ఉద్యోగం చేసే ఏ ఒక్కరూ ఇకపై యూట్యూబ్ ఛానల్స్‌ను నిర్వహించవద్దంటూ కేరళ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఉద్యోగులు అలా చేయడం ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని జీవోలో తెలిపింది.