బాద్ షా లో.. బోయపాటి శ్రీనుపై సెటైర్ వేశాడు శ్రీనువైట్ల. అందులో ఎమ్మెస్ నారాయణని సినీ దర్శకుడిగా చూపించారు. ఆయన పాత్ర బోయపాటి శ్రీనుని దృష్టిలో పెట్టుకొని తీసిందే అనేది బహిరంగ రహస్యం. ఇప్పుడు బోయపాటి కూడా శ్రీనువైట్లపై సెటైర్ వేసి.. బాకీ తీర్చుకొన్నాడు. ఈనాటి సినీ పోకడలపై బోయపాటి మాట్లాడుతూ ”రూ.50 కోట్లు పెట్టి సినిమాలు తీసేది కమెడియన్ ని పెట్టి సినిమాలు తీయడానికి కాదు. సినిమాలో కామెడీ ఉండాలి గానీ, కామెడీ కోసం సినిమా ఉండకూడదు..” అని పరోక్షంగా బాద్ షా సినిమాపై చురక వేసేశాడు. బాద్ షా సినిమాలో ఎన్టీఆర్ కంటే… బ్రహ్మానందం పాత్రనే హైరేంజులో చూపించాడనేది ఎన్టీఆర్ అభిమానులు సైతం ఒప్పుకొన్న నిజం! మరి బోయపాటి సెటైర్ కి శ్రీనువైట్ల రియాక్షన్ ఏమిటో?