ఈరోజుల్లో, బస్ స్టాప్ చిత్రాలతో యువతకు గాలమేశాడు మారుతి. వివాదాలూ, విమర్శల మాటెలా ఉన్నా… దర్శకుడిగా మారుతి… తన నిర్మాతలకు మాత్రం భారీ లాభాలను మిగిల్చాడు. అందుకే గీతా ఆర్ట్స్‌లో అవకాశాన్ని దక్కించుకొన్నాడు. అంతే కాదు… అల్లు అరవింద్ కూడా తన రెండో అబ్బాయి శిరీష్ ని… మారుతి చేతిలో పెట్టారు. మారుతి దర్శకత్వం వహించే చిత్రం.. కొత్తజంట. శిరీష్, రెజీనా జంటగా కనిపిస్తారు. బన్నీ వాసు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తారు. మే 11న ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. శిరీష్ ని కొత్తగా చూపించే చిత్రమిదని, వినోదం, ప్రేమ కలగలిపి తీర్చిదిద్దుతామని మారుతి చెబుతున్నారు. గౌరవం సినిమాతో బ్యాడ్ ఎంట్రీ ఇచ్చిన శిరీష్… తన తఢాకా చూపించాలంటే.. కొత్తజంటలో మెరవాల్సిందే. మరి శీరిష్ ని మారుతి ఎలా చూపిస్తాడో చూడాలి.