బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా.. భారత్‌లో పర్యటించనుంది. ఈ నెల 9 నుంచి జరగనున్న ఈ టెస్టు సిరీస్ కోసం ఆస్ట్రేలియ జట్టు భారత్ తో నాలుగు టెస్టుల సిరీస్‌ను ఆడనుంది. ఫిబ్రవరి 9 నుంచి జరగనున్న ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. 18 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ప్రకటించింది. భారత పర్యటనను దృష్టిలో పెట్టుకుని స్పిన్నర్లకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఎక్కువగా అవకాశం కల్పించింది. నలుగురు స్పిన్నర్లను జట్టులోకి తీసుకుంది. ప్యాట్ కమిన్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఈ జట్టులో యువ ఆటగాళ్లకు చాన్స్ ఇచ్చింది.
నాగ్‌పుర్‌లో జరిగే ఫస్ట్ టెస్టు మ్యాచ్ తర్వాత మిచెల్ స్టార్క్ అందుబాటులో వస్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. అన్‌క్యాప్డ్ ప్లేయర్ ల్యాన్స్ మోరిస్ తన స్థానాన్ని నిలుపుకున్నాడు. భారత్‌లో అతడు టెస్టు అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి. ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ కూడా దక్షిణాప్రికాతో పాటు ఓపెనింగ్ టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశముంది. సౌతాఫ్రికాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో గాయాల పాలు అయ్యాడు.
అయితే ఈ సారి ఆస్ట్రేలియా జట్టులో ఎక్కువగా స్పిన్నర్లకు సెలక్షన్ కమిటీ అవకాశం కల్పించింది. స్టార్ స్పిన్నర్ నాథన్ లయన్‌తో పాటు టాడ్ మర్ఫీ, మిచెల్ స్వెప్ సన్, ఆష్టన్ అగర్ జట్టులోకి తీసుకుంది. 2019 జనవరి తర్వాత తొలిసారిగా బ్యాటర్ పీటర్ హ్యాండ్స్‌కంబ్‌ను పిలుపిచ్చింది. అతడితో పాటు మ్యాట్ రెన్షా రిజర్వ్ బ్యాటర్ల జాబితాలో ఉన్నాడు. మార్కస్ హ్యాన్రిస్ కూడా ఈ జట్టులో ఉన్నాడు.
ఇప్పటికే బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. రోహిత్ సారథ్యంలోని టీం ఆసీస్ ను ఎదుర్కొనేందుకు ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది. ఇటివలే కివీస్, శ్రీలంక జట్లను ఓడించి మంచి ఊపుమీద కనిపిస్తోంది. డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకోవడానికి టీమిండియాకు ఇదే చివరి అవకాశం. డబ్ల్యూటీసీ తుది పోరులో వరల్డ్ నెంబర్ వన్ ఆసీస్ కు స్థానం దాదాపుగా ఖాయం కాగా.. ఈ సిరీస్ ను భారత్ 4-0తో క్లీన్‌స్వీప్ చేస్తే దర్జాగా ఫైనల్లోకి అడుగుపెట్టొచ్చు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో పోల్చితే టీమిండియాపైనే అధిక ఒత్తిడి ఉండే అవకాశం ఉంది.
ఎత్తుకు పైఎత్తులతో సాగే భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ సమరానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఆస్ట్రేలియా రూపంలో స్వదేశంలో ఎదురుకానున్న కఠిన సవాల్‌ను ఎదుర్కోవడానికి టీమిండియా సన్నాహకాలను ఆరంభించింది. కానీ, స్వదేశంలో టీమిండియాను ఓడించడం కష్టసాధ్యమనే విషయం ప్యాట్ కమిన్స్ సేనకు తెలుసు.. సిరీస్ ప్రాముఖ్యతను గుర్తించిన భారత్ శుక్రవారం నుంచే నాగ్‌పూర్‌లో నెట్‌ప్రాక్ట్రీస్ షురూ చేసింది. చటేశ్వర్ పుజార, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్‌లు నెట్స్‌లో ముమ్మరంగా సాధన చేస్తున్న ఫొటోలను బీసీసీఐ ట్వీట్ చేసింది. రంజీ మ్యాచ్‌తో ఫిట్‌నెస్ నిరూపించుకొన్న ఆల్‌రౌండర్ జడేజా కూడా ప్యాడ్‌లు కట్టుకొని షాట్లు ఆడుతూ కనిపించాడు. ఈ సారి టీమిండియా నలుగురు స్పిన్నర్లతో రంగంలోకి దిగుతుంది. వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్, రాహుల్ చాహర్, సాయి కిషోర్‌లను నెట్‌బౌలర్లుగా బోర్డు ఎంపిక చేసింది. సొంతగడ్డపై ఆడిన గత మూడు సిరీస్ ల్లో భారత్‌దే తిరుగులేని ఆధిపత్యం కాగా.. దాన్ని బ్రేక్ చేయాలని ఆసీస్ పట్టుదలతో ఉంది.