అక్రమ సంబంధానికి, పవిత్రతను అంటగడుతున్నారు


టీడీపీ, జనసేనలు ఎప్పుడూ కలిసే ఉన్నాయని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అక్రమ సంబంధానికి పవిత్రతను అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 2024 షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, వెంటిలేటర్‌పై ఉన్న పార్టీలే ముందస్తు ఎన్నికలు కోరుకుంటున్నాయి అని అన్నారు. బలమైన జగన్‌ను ఎదుర్కొనేందుకు వీళ్లంతా ఏకమవుతున్నారు. జగన్‌కు ఉన్న ప్రజాబలం ముందు ఎవరూ నిలవలేరు అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.