వాల్తేరు వీరయ్య – నిఖార్సయిన కమర్షియల్ ఎంటర్ టైనర్


మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల పాత్రల ఇంట్రడక్షన్ గ్లింప్సెస్‌ తో పాటు .. ఇద్దరూ కలసి అలరించిన పూనకాలు లోడింగ్ పాటకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన అల్బమ్‌లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇక తాజాగా విడుదలైన వాల్తేరు వీరయ్య ట్రైలర్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలౌతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ వైజాగ్ లో మెగామాస్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని మాసీవ్ గా నిర్వహించింది. భారీ ఎత్తున తరలివచ్చిన అభిమానుల సమక్షంలో మాస్ జాతరలా జరిగిన మెగామాస్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. బాబీ వాల్తేరు వీరయ్య అనే టైటిల్ తో కథ చెప్పినపుడు వినగానే అద్భుతం అనిపించింది. షేక్ హ్యాండ్ ఇచ్చి ‘ఈ సినిమా తప్పకుండా చేస్తున్నాం’’ అని అప్పుడే చెప్పాను. ఫస్ట్ హియరింగ్ లోనే చాలా బావుంది అనుకునే కథలు నా కెరీర్ లో సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. ఆ నమ్మకంతో చెబుతున్నాను.. వాల్తేరు వీరయ్య చాలా బాగా ఆడుతుంది. ఈ సినిమా చేస్తున్నంత కాలం బాబీపై ప్రేమ రోజురోజుకు పెరుగుతూపోయింది. దానికి కారణం తన కష్టపడే తత్త్వం. ఒక అనుభవం తో ఇచ్చిన సూచనని తీసుకొని సినిమా బెటర్ మెంట్ కోసం అహర్నిశలు ప్రయత్నం చేసే దర్శకుడు బాబీ. అందుకే మొదటి రోజు విన్నది తర్వాత రోజురోజుకి అద్భుతంగా రూపాంతరం చెందింది. ప్రతి ఒక్కరిని అలరించే సినిమా వాల్తేరు వీరయ్య. బాబీలో కథకుడు, రచయిత, స్క్రీన్ ప్లే రైటర్, డైరెక్టర్ కనిపిస్తారు. ఆ తర్వాతే తనలో అభిమానిని చూస్తాను. అభిమాని అని సినిమా ఇవ్వలేదు. అతని ప్రతిభ అద్భుతమనే ఈ సినిమాని ఇచ్చాను. నా నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అనుకున్నదాని కంటే గొప్పగా సినిమాని తీశాడు. ఒక కమర్షియల్ సినిమాలో ఏ ఎలిమెంట్స్ కావాలో అన్నీ చక్కగా పొందుపరిచాడు. వాల్తేరు వీరయ్య ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్. ఇది కదా సినిమా.. ఇలాంటి కమర్షియల్ సినిమా వచ్చి ఎంత కాలం అయ్యిందని ప్రతి ఒక్కరితో అనిపిస్తాడు బాబీ. బాబీ అందించిన ఈ సినిమా నిఖార్సయిన కమర్షియల్ సినిమా. మీ చేత షెబాష్ అనిపించుకునే సినిమా. అందుకే నమ్మకంగా మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం. బాబీ ఎక్కడా విశ్రాంతి చెందలేదు. ఎక్కడైనా చిన్న గ్రేఏరియా వుంటే తన రైటర్స్ తో కూర్చుని దాన్ని అద్భుతంగా మలచి ఎక్కడా రిలాక్స్ అవ్వకుండా కసితో పని చేశాడు. అందుకే సినిమా అద్భుతంగా వచ్చింది. బాబీ చేసిన హార్డ్ వర్క్ చూసి నేను బాబీ అభిమానిని అయ్యాను. బాబీ నా అభిమాని అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను. రామానాయడు, అశ్వనీదత్, అల్లుఅరవింద్, కేఎస్ రామారావు లాంటి గొప్ప నిర్మాతల స్థాయిలో నిలబడ్డదగ్గ నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ రవిగారు, నవీన్ గారు, చెర్రీ. ఏనాడూ లెక్కలు చూసుకోలేదు. ఎక్కడా రాజీపడలేదు, సినిమాకి కావాల్సిన సమస్తం సమకూర్చారు. సినిమాలో మొదటి ఇరవై నిమిషాల్లో హాలీవుడ్ స్థాయి ఎపిసోడ్స్ వుంటాయి. అవి తెరపై చూస్తారు. మైత్రీ మూవీ మేకర్స్ కి సినిమా అంటే ప్యాషన్. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి కావాలి. ఇలాంటి నిర్మాతలని నిలబెట్టుకోవడం మన ఇండస్ట్రీ బాధ్యత. ఇన్నేళ పరిశ్రమలో ఒకే నిర్మాత రెండు భారీ చిత్రాలు ఒకేసారి విడుదల చేయడం ఎప్పుడూ జరగలేదు. ఇది ఫస్ట్ టైం జరిగింది. దీనికి కారణం కథలపై వారికుండే నమ్మకం. ప్రేక్షకులు రెండు సినిమాలని ఆదరిస్తారనే నమ్మకం. మైత్రీ మూవీ మేకర్స్ సంక్రాంతి రిలీజ్ చేయబోయే రెండు సినిమాలు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య పెద్ద విజయాలు సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. రవితేజ ఆజ్ కా గుండా రాజ్ సినిమాలో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ తో నాకు పరిచయమయ్యాడు. తర్వాత అన్నయ్య సినిమా కలిసి చేశాం. అన్నయ్య నుండి అలా ఎదిగి ఈ రోజు మాస్ మహారాజ్ అయ్యాడు. తనకంటూ ఒక ముద్రవేసుకున్నాడు. వాల్తేరు వీరయ్య లో మా పాత్రలు చాలా ఆసక్తికరంగా వుంటాయి. రవితేజ ఎంట్రీ తర్వాత సినిమా మరో స్థాయికి వెళుతుంది. ఈ పాత్రకు రవితేజ తప్పితే మరో నటుడు న్యాయం చేయలేడు. తను రావడం వలనే పాత్రకు న్యాయం జరిగింది. శ్రుతి హాసన్ చాలా చక్కగా చేసింది. తన పాత్రకు చాలా ప్రాధన్యత వుంటుంది. కేథరిన్ ఇందులో కీలకమైన పాత్ర. చాలా చక్కగా తన పాత్రని పోషించింది. ఊర్వశి రౌతేలా బాస్ పార్టీ సాంగ్ ని చాలా ఎనర్జిటిక్ గా చేసింది. ప్రకాష్ రాజ్, బాబీ సింహా చాలా అద్భుతంగా నటించారు. రాజేంద్ర ప్రసాద్ గారి పాత్రలో చాలా డెప్త్ వుంటుంది. శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, శకలక శంకర్ అందరూ చక్కగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ మా ఇంట్లో కుర్రాడు. ఈ రోజు నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం ఆనందంగా వుంది. ఇందులో ప్రతి సాంగ్ కి ప్రాణం పెట్టి మరో స్థాయికి తీసుకెళ్ళాడు. అద్భుతమైన నేపధ్య సంగీతం చేశాడు. సినిమా ఒక మ్యూజికల్ జర్నీలా వుంటుంది. అర్ధర్ విలన్స్ వండర్ ఫుల్ విజువల్స్ ఇచ్చారు. విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో వుంటాయి. శేఖర్ మాస్టర్ నాతో మళ్ళీ వింటేజ్ స్టయిల్ లో చాలా చక్కగా పాటలకు కొరియోగ్రఫీ చేశారు. డ్యాన్సులు చాలా గ్రేస్ ఫుల్ గా చేయించారు. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ అద్భుతమైన సెట్ వర్క్ చేశారు. వాల్తేరు వీరయ్యలో ప్రతి పది నిమిషాలకు ఒక హై వుంటుంది. ప్రతి సీన్ అనూహ్యంగా వుంటుంది. థ్రిల్ ఇచ్చే విధంగా వుంటాయి. వావ్..అంటూ ప్రతిది సీట్ ఎడ్జ్ లో చూస్తారు. దానికి కారణం రచయితలు కోనవెంకట్, మోహన్, చక్రి, వినీత్. బాబీ అందరినుండి మంచి వర్క్ ని రాబట్టుకున్నాడు. ఈ సినిమా తర్వాత బాబీ స్టార్ డైరెక్టర్ అవ్వడం అనేది ఎంతో దూరంలో లేదు. ఈ సినిమా కోసం అందరూ కలసి కట్టుగా పని చేశాం. వాల్తేరు వీరయ్య సూపర్ డూపర్ హిట్ అవ్వాలనే ఒకేఒక లక్ష్యంతో పని చేశాం. 13వ తేదిన పూనకాలు లోడింగ్. డోంట్ స్టాప్ సీయింగ్. గో ఆన్ సీయింగ్. లవ్ యూ ఆల్ ’’ అన్నారు .

మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. వాల్తేరు వీరయ్య నటీనటులకు, సాంకేతిక నిపుణలందరికీ ఆల్ ది బెస్ట్ కాదు.. కంగ్రాట్స్. ఎందుకంటే సినిమా బ్లాక్ బస్టర్. పూనకాలు లోడింగ్. చిరంజీవి గారితో నా జర్నీ మొదలైయింది విజయవాడ నుండి. విజేత వేడుక విజయవాడ లో జరిగినప్పుడు .. చిరంజీవి గారిని చాలా దూరం నుండి చూశాను. అప్పుడే మా ఫ్రండ్స్ తో ఏదో ఒక రోజు .. ఆయన పక్కన కూర్చుంటానని చెప్పాను. అక్కడ నుండి మొదలైతే మొదట ఫ్రండ్ క్యారెక్టర్, తర్వాత తమ్ముడి క్యారెక్టర్.. ఇప్పుడు వాల్తేరు వీరయ్య. చిరంజీవి గారితో వున్న ప్రతి మూమెంట్ చాలా గర్వంగా వుంటుంది. ఆయన నన్ను ఎంతో ఇష్టపడతారు ప్రేమిస్తారు. అన్నయ్య ఎవరేమన్నా భరిస్తారు.. బాధపడతారేమో కానీ బయటపడరు. ఆయనలో వున్న గొప్ప లక్షణం అది. ఆయన ఎప్పుడూ ఎవరి గురించి నెగిటివ్ గా మాట్లాడలేదు. బాబీ బలుపు సమయంలో పరిచయమయ్యాడు. పవర్ తీశాడు. వీరయ్యతో నెక్స్ట్ లెవల్ కి వెళ్తాడని నా గట్టి నమ్మకం. దేవిశ్రీ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. వాల్తేరు వీరయ్య సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కాబోతుంది. సక్సెస్ మీట్ లో మళ్ళీ కలుద్దాం’’ అన్నారు

దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా చేయడం నా జీవితంలో చాలా స్పెషల్ మూమెంట్.అన్నయ్యని ప్రేమించే వారు డైరెక్టర్ అయితే రిజల్ట్ ఇలానే వుంటుంది. హార్ట్ అండ్ సోల్ అన్నీ కలిపి ప్రేమించి ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఆన్నయ్యపై వున్న మా ప్రేమని రిఫ్లక్ట్ చేశాం. చిరంజీవి గారి అభిమానులుగా పుట్టడం మేము చేసుకున్న అదృష్టం. అన్నయ్య లాంటి వారు కుటుంబానికి ఒకరు వుండాలి. కోట్లాది మంది అభిమానులు బ్రహ్మరధం పడుతున్నారంటే కారణం అన్నయ్య మనసు. నిద్రలో కూడా సినిమాని ప్రేమించాలి.. రెండేళ్ళ ప్రయాణం లో ఆయన నుండి నేర్చుకున్న విషయం ఇది. 2003లో విజయవాడ గుంటూరు కి మధ్య ఇంద్ర వేడుక జరిగింది. అక్కడికి వచ్చిన కోట్లాది మందిలో నేను ఒకడిని. అప్పుడే మా నాన్నకి మాటిచ్చా. ఎప్పుడైనా చిరంజీవి గారితో సినిమా చేస్తానని. ముఫ్ఫై తొమ్మిదేళ్ళు వచ్చేసరికి మెగాస్టార్ సినిమాకి దర్శకుడిని అయ్యాను. ఇంతకంటే ఏం కావాలి. ఇది మా నాన్నగారు పై నుండి చూస్తున్నారు. ఇండస్ట్రీకి ఒకే ఒక మెగాస్టార్. అన్నయ్య పై వున్న ప్రేమని ఇందులో చూపించాం. ఇలాంటి కథకు మాకు కావాల్సిన శక్తి మాస్ మహారాజా రవితేజ గారు. చిరంజీవి గారు, రవితేజ గారు ఇద్దరూ స్వయంకృషి తో వచ్చిన గ్రేట్ స్టార్స్. ఇందులో రవితేజ గారిని తీసుకోవడం గొప్ప ఛాయిస్ అని కాలర్ ఎత్తుకొని వెళ్తారు మాస్ మహారాజా అభిమానులు. చిరంజీవి గారు రవితేజ గారి కాంబినేషన్ కి నేను న్యాయం చేశానని నమ్ముతున్నాను. నా రచయితలు వినీత్, మోహన్ కృష్ణ లతో రెండేళ్ళ క్రితం ఈ సినిమా ప్రయాణం మొదలైయింది. వారి సపోర్ట్ ని మర్చిపోలేను. మా గురువు గారు కోన వెంకట్, చక్రి ప్రాణం పెట్టి పనిచేశారు. వాల్తేరు వీరయ్యకి ఎన్నో సక్సెస్ మీట్లు వుంటాయి. మైత్రీ మూవీ మేకర్స్ తో పని చేయాలని కోరుకున్నాను. నేను అనుకున్న సినిమాని నాతో తీయించారు. నవీన్ గారు, రవి గారు , చెర్రి గారికి కృతజ్ఞతలు. దేవిశ్రీ ప్రసాద్ గారు బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. శేఖర్ మాస్టర్ అన్నీ పాటలకి అద్భుతమైన క్రోయోగ్రఫీ చేశారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ హైలెట్స్ గా వుంటాయి. ఇంటర్ వెల్ కి పది నిమషాల ముందు అరాచకం ఆరంభం అన్నట్లుగా వుంటుంది. పూనకాలు లోడింగ్ మా ఇంటర్వెల్ కార్డ్. ప్రకాష్ గారు వండర్ ఫుల్ సెట్స్ వేశారు. అర్ధర్ విలన్స్ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కెమరామెన్ అవుతారు. ఎడిటర్స్ నిరంజన్, చోటా , లిరిక్స్ రైటర్స్ చంద్రబోస్ , రామజోగయ్య శాస్త్రి గారి కి కృతజ్ఞతలు. డైలాగ్ రైటర్స్ భాను నందులకి థాంక్స్. ప్రకాష్ రాజ్ గారు అద్భుతంగా చేశారు. బాబీ సింహా గారు కూడా అన్నయ్యకి ఫ్యాన్. చాలా చక్కగా చేశారు. శ్రుతి హాసన్ చాలా వండర్ ఫుల్ గా చేసింది. కేథరిన్ పాత్ర గురించే ఇప్పుడే ఎక్కువ చెప్పలేను. థియేటర్ లో అందరూ ఎంజాయ్ చేస్తారు. ఊర్వశి చాలా చక్కగా ఫెర్ ఫార్మ్ చేసింది. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి థాంక్స్. పీటర్ మాస్టర్ రెండు ఫైట్స్ ఎక్స్ ట్రార్దినరీగా తీశారు. కాస్ట్యూమ్ డిజైనర్స్ సుస్మిత, నీరజలకి థాంక్స్. వాల్తేరు వీరయ్య పెద్ద సంక్రాంతి పండగ. దీని జాతర జనవరి 13 నుండి మొదలై ఎన్ని రోజులు వుంటుందో మీరే చూస్తారు. పూనకాలు అందరికీ రీచ్ అవుతుంది. ఫైట్స్ సాంగ్స్ ఎమోషన్స్ ఫన్ డైలాగ్స్ ప్రతిది మీ గుండెల్లో నాటుకుపోతుంది. అందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు.
నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. ఇది మరపురాని రోజు. మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా చేయడం ఒక డ్రీమ్. ఆ డ్రీమ్ ఇవాళ నెరవేరుతున్నందుకు చాలా ఆనందంగా వుంది. ఈ అవకాశం ఇచ్చిన చిరంజీవి గారికి కృతజ్ఞతలు. మాకు ఇంత ,మంచి సినిమా చేసిన బాబీ గారికి చాలా థాంక్స్. ఇందులో రవితేజ గారి పాత్ర ఇండియాలో ఆయన ఒక్కరే చేయగలరని మేము దర్శకుడు బాబీ చాలా సార్లు అనుకున్నాం. ఈ క్యారెక్టర్ ఒప్పుకొని చేసినందుకు రవితేజ గారికి చాలా థాంక్స్. ఈ చిత్రంలో పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు. దేవిశ్రీ గారు మాకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చారు. వాల్తేరు వీరయ్య ఆల్బమ్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆర్ఆర్ ఇరగదీశారు. వాల్తేరు వీరయ్య 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. అందరూ థియేటర్లో చూడండి. సినిమా ఖచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది’’ అన్నారు

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుండి ఒక హీరోని చూస్తూ ఆయన నటన డ్యాన్సులు, క్యారెక్టర్ తో స్ఫూర్తి పొంది ఎప్పటికైన దర్శకుడు కావాలని భావించిన ఒక దర్శకుడు.. ఆయనలానే మనం కూడా ఒక స్టార్ కావాలని భావించి ఎక్స్ ట్రార్డినరీ హీరో అయిన ఒక మాస్ మహారాజా, ఆయన డ్యాన్సులతో స్ఫూర్తి పొంది మ్యూజిక్ డైరెక్టర్ కావాలని భావించి మ్యూజిక్ డైరెక్టరైన ఒక మ్యూజిక్ డైరెక్టర్.. ఎంతమంది హీరోలతో సినిమాలు తీసిన ఈయనతో సినిమా చేస్తే కానీ మన కల తీరదని భావించే ఒక ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్.. వీళ్ళంతా కలసి మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా చేస్తే .. వాల్తేరు వీరయ్యలా వుంటుంది. పూనకాలు లోడింగ్ లా వుంటుంది. చిరంజీవి గారి కి ఇది ఒక ట్రిబ్యూట్ లా వుండాలని చేశాం. వాల్తేరు వీరయ్య మ్యూజిక్ సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. మాస్ మహారాజా రవితేజ గారిని చూసినప్పుడల్లా ఒక పూనకం వచ్చేస్తుంటుంది. చిరంజీవి గారు, రవితేజ గారిలో వున్న గొప్ప లక్షణం.. ఎల్లప్పుడూ పాజిటివ్ గా వుండటం, ఎదుటివారిని ప్రేమించడమే వారికి తెలుసు’’ అన్నారు.

కేథరిన్ థ్రెసా మాట్లాడుతూ.. చిరంజీవి గారు వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ . ఆయనతో పని చేయడం ఒక గొప్ప గౌరవం. రవితేజ గారి ఎనర్జీ, పాజిటివిటీ స్ఫూర్తిదాయకం. బాబీ గారు వండర్ ఫుల్ డైరెక్టర్. సినిమాని అద్భుతంగా తీశారు. దేవిశ్రీ ప్రసాద్ గారు ఫ్యాన్స్ కి ట్రీట్ లాంటి మ్యూజిక్ ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ కి కృతజ్ఞతలు. జనవరి 13న థియేటర్ లో వాల్తేరు వీరయ్యని చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు.

ఊర్వశి రౌతేలా మాట్లాడుతూ.. వాల్తేరు వీరయ్య ప్రాజెక్ట్ లో పని చేయడం చాలా ఆనందంగా వుంది. బాబీ గారు అద్భుతమైన ప్రతిభ, విజన్ వున్న దర్శకుడు. సినిమాని అద్భుతంగా ప్రజంట్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ గారు నెక్స్ట్ లెవల్ మ్యూజిక్ ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ కి కృతజ్ఞతలు. రవితేజ గారు నా ఫేవరేట్ యాక్టర్. చిరంజీవి గారితో పని చేయడం ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో లో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. ఈ పండగని వాల్తేరు వీరయ్యతో సెలబ్రేట్ చేసుకుందాం’’ అన్నారు.

సుస్మిత కొణిదెల మాట్లాడుతూ.. బాబీ గారు కథ చెప్పిన తర్వాత ఒక ఫ్యాన్ గా నాన్నగారిని ఎంత స్టయిలీష్ గా చూడాలనుకునే పని చేశాను. ఆయన పర్సనాలిటీ ఇంకాఇంకా యంగర్ అవుతూనే వుంది. దాన్ని క్యాచప్ చేయాలంటే నా ప్రతిభని ఇంకా పెంచుకోవాలని ఆయనే నాకు ఛాలెంజ్ ఇస్తూ వుంటారు. ఈ అవకాశం ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్ కి థాంక్స్. బాబీ గారితో పని చేయడం అంటే నా సొంత బ్రదర్ తో పని చేసినట్లే. జనవరి 13 కోసం ఎదురుచూస్తున్నాను’’ అన్నారు.

చెర్రీ మాట్లాడుతూ.. వాల్తేరు వీరయ్య ప్రాజెక్ట్ ని ఎగ్జిక్యూట్ చేసే అవకాశం రావడం చాలా అదృష్టం గా భావిస్తున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారు, మాస్ మహారాజా రవితేజ గారు, ప్రకాష్ రాజ్ గారు, రాజేంద్రప్రసాద్ గారితో కలసి పని చేసే గొప్ప అదృష్టం దొరికింది. చిరంజీవి గారు శ్రమ, పట్టుదల, అకింతభావం, నిజాయితీకి నిదర్శనం. ఆయన దగ్గర నుండి ఎన్నో మంచి విషయాలని నేర్చుకునే అవకాశం దొరికింది. రవితేజ గారితో కలసి విక్రమార్కుడు సినిమాకి పని చేశాను. ఆయన సెట్స్ కి వస్తే ఒక పాజిటివ్ ఎనర్జీ వుంటుంది. బాబీ గారు చాలా క్లారిటీ వున్న దర్శకుడు. ఈ సినిమాతో మరోస్థాయికి వెళ్తారు. దేవిశ్రీ గారు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ థాంక్స్. జనవరి 13న సినిమా చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.

కోన వెంకట్ మాట్లాడుతూ.. వాల్తేరు వీరయ్యతో మెగాస్టార్ ని దగ్గర నుంచి చూసే అవకాశం మాకు దక్కింది. మెగాస్టార్ అంటే ఒక స్వయంకృషి. వాల్తేరు వీరయ్యకి పని చేయడం ఒక గొప్ప అదృష్టం. ఈ అవకాశం రావడానికి కారణం దర్శకుడు బాబీ. మెగాస్టార్ కి వున్న కోట్లమంది అభిమానుల్లో బాబీ ఒకడు. ఇందులో కథ, తన కష్టంతో పాటు చిరంజీవి గారిపై వున్న ప్రేమని మిక్స్ చేశాడు. అందుకే వాల్తేరు వీరయ్య అంత బావుంటుంది. అలాగే తనకి తొలి అవకాశం ఇచ్చిన రవితేజ గారిపై ప్రేమని మిక్స్ చేశాడు. అందుకే వాల్తేరు వీరయ్య అంత బావుంటుంది. అమెరికాలో జనవరి 12 ప్రిమియర్ షోలకి తెలుగు వారందరూ సెలవు పెట్టేసారు. వర్క్ ఫ్రమ్ వాల్తేరు వీరయ్య థియేటర్ చేయబోతున్నారు. ఈ సంక్రాంతికి మెగాస్టార్ ని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఇంత భారీ సినిమాకి ప్యాషన్ వున్న నిర్మాతలు కావాలి. ఆ ప్యాషన్ వున్న నిర్మాతలే మైత్రీ మూవీ మేకర్స్. దేవిశ్రీ ప్రసాద్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో అందరం అన్నయ్యని ప్రేమించి చేశాం. ఇది మాకు చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుతుంది.’’ అన్నారు.

చక్రి మాట్లాడుతూ.. చిరంజీవి గారికి నేను డై హార్ట్ ఫ్యాన్ ని. ఆయన మూవీ టికెట్స్ కోసం లాఠీ దెబ్బలు తిన్నవారిలో నేను ఒకడిని. అలాంటిది ఆయన సినిమాకి ఒక రచయితగా పని చేసే అవకాశం రావడం అదృష్టంగా బావిస్తున్నాను. చిరంజీవి గారికి, దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ ప్రపంచంలో రెండు విషయాలు ఎప్పుడూ తగ్గవు. ఒకటి భూమి రేటు. ఇంకొకటి రవితేజ గారి ఎనర్జీ. రవితేజ గారికి హ్యాట్సప్. దర్శకుడు బాబీ ఈ సినిమా కోసం ఎంతో అంకితభావంతో పని చేశారు. దేవిశ్రీ ప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. 13న వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ అవుతుంది’’ అన్నారు.

ఏఎస్ ప్రకాష్ మాట్లాడుతూ… ఈ అవకాశం ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి, రవితేజ గారికి, బాబీ గారికి మైత్రీ మూవీ మేకర్స్ కి కృతజ్ఞతలు. వాల్తేరు వీరయ్యలో షిప్పింగ్ యార్డ్ సెట్ వేయడానికి రెండు నెలలు పట్టింది. దాదాపు నాలుగు వందల మంది దిని కోసం హార్డ్ వర్క్ చేశారు’’ అన్నారు.

ఈ ఈవెంట్లో రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ , శేఖర్ మాస్టర్ , శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, శకలక శంకర్ తదితరులు పాల్గొన్నారు.