సినిమా థియేటర్ల విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు !


సినిమా హాళ్ల యజమానులు తమ థియేటర్ ప్రాంగణంలో ఆహార పానీయాల విక్రయానికి సంబంధించి తమకు అనువైన నిబంధనలు, షరతులను నిర్ణయించుకోవచ్చునని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సినిమా హాళ్ళ యజమానులు తమ ప్రాంగణంలో బయటి ఆహారాన్ని అనుమతించాలా వద్దా అనే విషయాన్ని వారే నిర్ణయించుకోవచ్చునని భారత ప్రధాన న్యాయమూర్తి, D.Y. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.