సొంతూళ్లకు వెళ్లకుండానే ఓటు హక్కు వినియోగించుకునేలా రిమోట్ ఓటింగ్‌ను తీసుకొచ్చేందుకు ఈసీ సిద్ధమవుతోంది. ఈ రిమోట్ ఓటింగ్‌కు సంబంధించి ఎన్నికల సంఘం ఈసీ ఓ కాన్సెప్ట్ నోట్‌ను సిద్ధం చేసింది. దీంతో పాటు ఓ రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ నమూనాను రూపొందించింది. ఒకే పోలింగ్ బూత్ నుంచి 72 నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా ఈ రిమోట్ ఈవీఎంను అభివృద్ధి చేశారు.
జనవరి 16న ఈ నమూనా మిషన్ ప్రదర్శన కోసం అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించినట్లు ఈసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. రిమోట్ ఓటింగ్ ను అమల్లోకి తెచ్చేముందు.. ఆచరణలో ఎదురయ్యే న్యాయపరమైన, సాంకేతిక సమస్యలను గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఈసీ వివరించింది. ఇందుకోసం రాజకీయ పార్టీల అభిప్రాయాల కోరనున్నట్లు పేర్కొంది.