ఆంధ్రప్రదేశ్ లో కాపులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో, ప్రభుత్వ విద్యా సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు మరోసారి ప్రశ్నించారు.. జీవీఎల్ అడిగిన ఈ ప్రశ్నకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి ప్రతిమా భూమిక్ సమాధానం ఇస్తూ… రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ఏ కులానికైనా బీసీ రిజర్వేషన్లు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి అవసరం లేదని స్పష్టం చేసారు..ఆ రకంగా కాపులకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉన్నదని మంత్రి స్పష్టం చేశారు.
1993 నుండి ప్రత్యేక కేంద్ర మరియు రాష్ట్ర జాబితాలు ఉనికిలో ఉన్నాయని వాటి ప్రకారం తాము అనుకున్న కులాలకు రిజర్వేషన్ కల్పించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు కలదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కాపులకు బీసీ రిజర్వేషన్లు ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పదేపదే చెప్తూ కాపులను ప్రజలను తప్పుదోవ పట్టించి వైసీపీ, టీడీపీలు కాపులను దశాబ్దాలుగా పూర్తిగా మోసం చేశాయని ఇది కాపులపై వారికున్న కపట ప్రేమకు నిదర్శనమని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.