జబర్దస్త్ నటుడు ఆర్పీ హోటల్ ముందు బౌన్సర్లు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు


జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది నటులు ఫేమస్ అయ్యారు. అందులో కిర్రాక్ ఆర్పీ ఒకడు. నాగబాబు జడ్జిగా ఉన్నంతకాలం జబర్దస్త్ లోనే ఉన్న ఆర్పీ.. ఆయన బయటకు రావడంతోనే బయటకు వచ్చేసాడు. ఆ తరువాత మరో కామెడీ షోలో పాల్గొన్న ఆర్పీ అక్కడ కూడా ఎక్కువ రోజులు లేకుండా బయటికి వచ్చేశాడు. ఇక ఇటీవలే కూకట్ పల్లిలో నెల్లూరు చేపల పులుసు అనే ఒక కర్రీ పాయింట్ ను ఓపెన్ చేశాడు. ఇక్కడకు జనం కుప్పలు తెప్పలుగా వస్తున్నారట. ఒక ఇంటర్వ్యూలో ఆర్పీ మాట్లాడుతూ తన కర్రీ పాయింట్ వద్ద జనాలు తోసుకుంటున్నారని అందుకే వారిని కంట్రోల్ చేయడానికి బౌన్సర్లను పెట్టినట్లు చెప్పుకొచ్చాడు.

దేవుడా ఇదేం విచిత్రం.. డప్పు కొట్టుకోవచ్చు కానీ మరి ఇంత డప్పు కొట్టుకోవడం ఏంటా..? అని అందరు నోళ్లు నొక్కుకుంటున్నారు. అయితే ఆర్పీ చెప్పింది అక్షరాలా నిజం అని తెలుస్తోంది. చేపల పులుసు టెస్ట్ బాగుండడంతో అక్కడ జనాలు కార్తీ కోసం కొట్టుకుంటున్నారని ఒక వీడియో ద్వారా తెల్సింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు జనాలు కిక్కిరిసి ఉంటున్నారు. వారిని అదుపులో ఉంచడానికి బౌన్సర్లు నానా తిప్పలు పడుతున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. ఇక ఈ వీడియో చూసాక ఆర్పీ కర్రీ పాయింట్ గట్టిగా నడుస్తోందనియు తెలుస్తోంది. మరి ఆర్పీ చెప్పినట్లు హైదరాబాద్ మొత్తం బ్రాంచ్ లు తెరుస్తాడేమో చూడాలి.