కోవిడ్ అలెర్ట్ : రాష్ట్రాలకు కేంద్రం సూచనలు


చైనా, జపాన్‌, అమెరికా, కొరియా, బ్రెజిల్‌ దేశాలలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిందిగా రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరించింది. పాజిటివ్‌ శాంపిల్స్‌ను వెంటనే జినోమ్‌ సీక్వెన్సింగ్‌ చేయాంచాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాజీవ్‌ భూషణ్‌ రాష్ట్రాలకు లేఖ రాశారు. వివిధ రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన INSACOG జినోమ్‌ సీక్వెన్సింగ్‌ లేబొరేటరీలు ఉన్నాయని.. వాటికి రోజువారీ పద్ధతిలో పాజిటివ్‌ శాంపిల్స్‌ను పంపాలని ఆ లేఖలో సూచించారు. పాజిటివ్‌ కేసుల విషయంలో 2022 జూన్‌ నెలలో కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.