బంగ్లాదేశ్తో తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 188 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తుచిత్తుగా ఓడించింది. 513 పరుగుల విజయ లక్ష్యంతో ఓవర్నైట్ స్కోరు 272/6తో చివరి రోజు, ఆదివారం ఆట కొనసాగించిన బంగ్లా రెండో ఇన్నింగ్స్ లో 324 పరుగులకే కుప్పకూలిపోయింది. జాకిర్ హసన్ (100), కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (84), నజ్ముల్ హొస్సేన్ శాంటో (67) సత్తా చాటారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ (4/77), కుల్దీప్ యాదవ్ (3/73) రాణించారు. చివరి రోజు ఆట మొదలైన వెంటనే మెహిదీ హసన్(13)ను మహ్మద్ సిరాజ్ పెవిలియన్ పంపి భారత్ కు బ్రేక్ ఇచ్చాడు.