అణ్వాయుధ సామర్థ్యం ఉన్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని-5’ పరీక్ష విజయవంతమైంది. ఐదు వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల సత్తా దీనికి ఉంటుంది. ఆసియా యావత్తూ ఈ క్షిపణి పరిధిలోకి వస్తుంది. గత ఏడాది అక్టోబరులోనూ ఇలాంటి క్షిపణి పరీక్షను మనదేశం నిర్వహించింది.
17 మీటర్ల ఎత్తైన ఈ క్షిపణి అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగలదు. 1.5 టన్నుల వార్‌హెడ్‌ను మోసుకుపోగలదు. జూన్‌లోనే అగ్ని-4 క్షిపణిని మన దేశం విజయవంతంగా ప్రయోగించింది. అగ్ని-1 నుంచి అగ్ని-4 రకం క్షిపణులు 700-3,500 కి.మీ. మధ్య దూరాన్ని చేరుకోగలవు. అవన్నీ మన రక్షణ బలగాలకు అందుబాటులోకి వచ్చాయి. అగ్ని-5 డిజైన్, అభివృద్ధి హైదరాబాద్‌లోని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ ప్రయోగశాలల్లో జరిగింది.