Srisailam : 400 కోట్లతో రోప్‌వే ప్రాజెక్టు


తెలంగాణలోని ఈగలపెంట నుంచి శ్రీశైలం మధ్య రూ.400 కోట్ల అంచనాతో రోప్‌వే ప్రాజెక్టు ఏర్పాటుకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ పచ్చజెండా ఊపింది. పర్వతమాల పరియోజన ప్రాజెక్టు కింద కేంద్రం దేశ వ్యాప్తంగా 26 చోట్ల రోప్‌వేల ఏర్పాటుకు నిధులు కేటాయించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏపీ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందని ఆ రాష్ట్ర పర్యాటకాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ వెల్లడించారు. ఢిల్లీ నుంచి బుధవారం జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నిర్వహించిన వీడియో సమావేశంలో ఈ అంశాన్ని చర్చించారు. రజత్‌ భార్గవ మాట్లాడుతూ శ్రీశైలానికి రోజూ పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శిస్తున్నందున, రోప్‌వే ఏర్పాటుతో పర్యాటకంగా ఇది ఎంతో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు