Kaloji University Alert : ఖాళీగా ఉన్న సీట్ల కోసం వెబ్‌ ఆప్షన్లు, ఎప్పటినుండి అంటే ….


పీజీ వైద్య విద్య యాజమాన్య కోటా సీట్లకు వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు కాళోజి హెల్త్‌ యూనివర్సిటీ ‌తెలిపింది. ఈ మేరకు హెల్త్‌ యూనివర్సిటీ నేడు స్ట్రె (STRAY) విడత ప్రవేశాలకు ప్రకటన విడుదల చెసింది. తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఇప్పటికే మూడు విడతల కౌన్సిలింగ్ పూర్తి అయింది. ఇంకా ఖాళీగా ఉన్న సీట్లను ఈ చివరి విడత కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. నేడు రాత్రి 7 గంటల నుంచి రేపు ఉదయం 11 గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారిగా వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.in లో చూడాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు .