ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 చోట్ల హెల్త్ హబ్‌ల ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారని, ఆ దిశగా చర్యలు కూడా తీసుకున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (భారత పరిశ్రమల సమాఖ్య) ఆధ్వర్యంలో న్యూ ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ఉన్నతస్థాయి ప్రతినిధులతో ప్రపంచ స్థాయిలో పేరున్న ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ యూనిట్ల అధినేతల సమావేశాన్ని నిర్వహించారు. ఏపీ ప్రభుత్వ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంలో మంత్రి విడదల రజినితోపాటు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జీఎస్ నవీన్‌కుమార్ ఉన్నారు.