2014-19 మధ్య రాజధాని భూసేకరణ ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్లో అవకతవకలు జరిగాయని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేయగా ఇందులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా నారాయణ, ఏ3గా లింగమనేని రమేష్, ఏ4గా లింగమనేని రాజశేఖర్, ఏ5గా అంజనీకుమార్, ఏ6గా హెరిటేజ్ ఫుడ్స్‌ను సీఐడీ అధికారులు చేర్చారు. వీరిపై 120బీ, 420, 34, 35, 36, 37, 166 కింద కేసు నమోదు చేశారు. అలైన్ మెంట్ మార్పుతో రామకృష్ణ హౌసింగ్, హెరిటేజ్ ఫుడ్స్, ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్, లింగమనేని అగ్రికల్చర్ పామ్స్, జయని ఎస్టేట్స్ కు లబ్ది కల్గించారని ఆరోపణలు చేసారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.