67 అశ్లీల వెబ్‌సైట్‌లను బ్యాన్ చేసిన కేంద్రం


67 అశ్లీల వెబ్‌సైట్‌లను (పోర్నగ్రఫీ వెబ్‌సైట్స్‌) కేంద్రం నిషేధించింది. వీటిని తక్షణమే బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ కంపెనీలను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు 2021లో జారీ చేసిన కొత్త ఐటీ నిబంధనలకు అనుగుణంగా వీటిని వెంటనే నిలిపివేయాలని తెలిపింది. ఈ మేరకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు టెలికాం విభాగం ఈ-మెయిల్‌ పంపింది. అశ్లీలత.. మహిళల గౌరవానికి భంగం కలిగిస్తోందన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఆదేశాలు జారీ చేసినట్లు టెలికాం విభాగం పేర్కొంది.