వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ బీజేపీ ఎంపి


వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను అప్పుల రాష్ట్రంగా మార్చేసిందని బీజేపీ ఎంపి (రాజ్యసభ ) కే.లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన బీజేపీ ప్రజా పోరు కార్యక్రమంలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, కబ్జాలతో అధికార పార్టీ నేతలు కోట్లు సంపాదిస్తున్నారని విమర్శించారు. కుటుంబ పాలనకు స్వస్తి పలకాలన్నారు. టిడిపి ప్రతిపక్ష పాత్రను పోషించడం లేదని.. బిజెపి-జనసేన వైపు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని లక్ష్మణ్ తెలిపారు.