ఏపీలో ఉద్యోగాల జాతర


ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 269 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్‌-4 సర్వీసెస్‌ కింద 06, పలు విభాగాల్లో నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగాలు 45, ఆయుష్ (ఆయుర్వేదం)లో వైద్యాధికారులు 72, ఆయుష్‌(హోమియో)లో 34 లెక్చరర్‌ పోస్టులు, 53 వైద్యాధికారులు, ఆయుష్(యునాని)లో 26 వైద్యాధికారులు, పలు విభాగాల్లో 23 ఏఈఈ ఉద్యోగాలు, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు 07, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 03 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్‌లైన్‌ ద్వారా నిర్ణీత తేదీల్లో దరఖాస్తు చేసుకోవాలని.. పూర్తి వివరాలు http://psc.ap.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చని ఏపీపీఎస్సీ కార్యదర్శి అరుణ్‌కుమార్‌ తెలిపారు.