ఉప్పల్ : నిఘా నీడలో భారత్ –ఆస్ట్రేలియా మూడవ T20 మ్యాచ్


హైదరాబాద్ : ఉప్పల్ స్టేడియం లో భారత్ –ఆస్ట్రేలియా మధ్య జరిగే T20 క్రికెట్ మ్యాచ్‌కు 2,500 మంది పోలీసు సిబ్బందిని విధుల్లో ఉంచుతున్నట్లు రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్‌ భగవత్‌ తెలిపారు. 300 సీసీ కెమెరాలను బిగించామని, మ్యాచ్‌పై పోలీసుల నిఘా ఉంటుందని చెప్పారు. బ్లాక్ టికెట్లు అమ్మే వారిపై కూడా నిఘా ఉంటుందని తెలిపారు. మ్యాచ్ జరిగే రోజు అర్ధరాత్రి వరకు మెట్రో రైలు, ఆర్టీసీ బస్సులు నడుస్తాయని కమీషనర్ మహేష్‌ భగవత్‌ తెలిపారు.